ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు ఏఐసీసీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…అనంతరం మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చర్చించే ఛాన్స్ ఉంది. దీని కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
కాగా, ఇవాళ కాంగ్రెస్ నూతన కార్యాలయం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది. కొత్త భవనంతో పాటు, త్వరలో సరికొత్త రూపును సంతరించుకోనుంది కాంగ్రెస్ పార్టీ. ఇక నుంచి “ఏఐసిసి ప్రధాన కార్యాలయం” అడ్రస్ …9-A, కోట్ల రోడ్ కానుంది. ఇప్పటి వరకు 24, అక్బర్ రోడ్ చిరునామా తో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉండేది. ఇక ఇప్పుడు “ఏఐసిసి ప్రధాన కార్యాలయం” అడ్రస్ …9-A, కోట్ల రోడ్ కానుంది.