సీఎం రేవంత్ రెడ్డి యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి : ఎంపీ లక్ష్మణ్

-

అయోధ్య బాల రాముడి అక్షింతలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవిత్రమైన అక్షింతలను సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్ హిందువుగా చెప్పుకోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. యావత్ హిందూ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయకుండా గాడిద గుడ్డు చూపిస్తున్నారని, కాంగ్రెస్ ఆ పార్టీ గుర్తును గాడిద గుడ్డుగా మార్చుకున్నట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తోందని కాంగ్రెస్ నేతలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్ల కోసం పాకులాడుతోందని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఆ పార్టీ ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తోందని ధ్వజమెత్తారు. ఈ పదేళ్లో ప్రధాని మోడీ ఎవరి రిజర్వేషన్లను తొలగించలేదని, అదనంగా ఈడబ్ల్యూసీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version