ఈ సీజన్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అతనే: గ్రేమ్ స్మిత్

-

కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ నరైన్పై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ ప్రశంసల వర్షం కురిపించారు. నరైన్ ఈ సీజన్లో మంచి ప్రదర్శన చేస్తున్నాడని కొనియాడారు. అతను ఒక్కసారి ఊపందుకొని క్రీజులో కుదురుకుంటే చాలా ప్రమాదకరంగా మారతాడని అన్నారు. తన దృష్టిలో ఇప్పటివరకైతే సునీల్ నరైన్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని తెలిపారు.

కాగా, నరైన్‌ ఈ ఐపీఎల్ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడి 183.67 స్ట్రైక్‌రేట్‌తో 461 రన్స్ చేశాడు. అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. కోల్‌కతా ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపు ఖాయమైంది. ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో సునీల్ నరైన్ ఇదే దూకుడు కొనసాగిస్తే అతడు టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version