రైతు నేస్తం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

-

‘రైతు నేస్తం’ ప్రొగ్రామ్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. రైతు వేదిక లకు వీడియో కాన్ఫరెన్స్ల అను సంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తమని సీఎం రేవంత్ అన్నారు. దశలవారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన చేయనున్నట్లు తెలిపారు. రూ.97 కోట్లతో ప్రాజెక్టు అమలు చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

 

రూ. 4.07 కోట్లను ఈ కార్యక్రమానికి ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్- ఫ్లాట్ ఫారం ఉపయోగపడుతుందని సీఎం అన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు జరపవచ్చన్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవచ్చన్నారు. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవచ్చన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం అమలవుతుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version