నేడు SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇందులో భాగంగానే…ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి హెలికాప్టర్ లో వనపర్తి పర్యటన కు బయల్దేరుతారు. 11.30 కు వనపర్తి లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో పూజలు.

ఆలయ అభివృద్ధి పనులకు పునాది రాయి వేస్తారు.12 గంటలకు స్థానిక ZPHS పాఠశాల .. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చేరుకుంటారు. పార్టీ ముఖ్యులు, తన చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మధ్యాహ్నం 2.15 గంటలకు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాన్ని ప్రారంభిస్తారు. మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ తో పాటు అక్కడ ఏర్పాటుచేసిన రుణ మేళా, ఉద్యోగ మేళా లో పాల్గొంటారు. సాయంత్రం 4.15 కు వనపర్తి నుంచి SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు.