వాళ్లు మూసీ బాధితులు కాదు… కిరాయి మనుషులతో..బావ బామ్మర్ది లు ధర్నాలు చేయిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మూసీ బాధితుల పేరిట కిరాయి మనుషులతో మాట్లాడిస్తున్నారని… మూసీ బాధితులకు కేటీఆర్, హరీష్ రావు రూ.500 కోట్లు ఇవ్వండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. వన్ స్టేట్ వన్ కార్డు పైలట్ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. అనంతరం మాట్లాడారు. మూసి నీ అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు బతుకుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసి పేదలకు ఇండ్లు ఇవ్వాలా వద్దా…. నమ్మి మోస పోయినా పేదలకు పరిహారం ఇద్దాం రండి అంటూ పిలుపునిచ్చారు. కేటీఆర్..హరీష్ ముందు రోజు మాట్లాడతారు…. తెల్లారి వాళ్ళు మాట్లాడిన కాగితం పట్టుకున్నాడని ఈటలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ మరిగా.. పాత పార్టీ గత్తర వాసన పోవడం లేదని సెటైర్లు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. మూసి పరివాహక ప్రాంతంలో పేదలకు ఇండ్లు కట్టింద్దా… రండి మోడీ దగ్గరకి పోదాం మాకేం భేషజాలు లేవు అన్నారు.