తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. AICC పిలుపు మేరకు అదానీకి వ్యతిరేకంగా నిరసన తెలపనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఉదయం 10 గంటలకు ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ నుంచి ఈడి కార్యాలయం వరకు భారీ ప్రదర్శన, ఈడి కార్యాలయం ముందు భారీ ధర్నా నిర్వహించనున్నారు.
ఈ ధర్నాలో టీపీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హాజరుకానున్నారు. ఆధాని మెగా కుంభకోణం పై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. ఈ ధర్నా చేస్తున్నారు. సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలి, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని… దోషులకు చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్లతో ఈ ఆందోళన చేస్తున్నారు.