సత్య నాదెళ్ల తో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. వాటి పై చర్చ..!

-

మైక్రోసాప్ట్  సీఈవో సత్య నాదేళ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ లో సత్య నాదెళ్ల  నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ స్కిల్ యూనివర్సిటీ
, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ పై ఇరువురు చర్చించారు.  అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వంటి రంగాల్లో సహకారం కోసం అవకాశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీకి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు హాజరయ్యారు.

సత్యనాదేళ్ల ప్రస్తుతం హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి. సత్య నదేళ్లతో ముగిసింది సీఎం రేవంత్ రెడ్డి భేటీ..  మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కేంద్రంలో 4 వేల ఉద్యోగాలు వచ్చే విధంగా ఇటీవల ఒప్పందాలు జరిగగా ఆ పురోగతిపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.  దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి సత్య నాదేళ్లను కోరినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version