తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంశించిన విషయం తెలిసిందే. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో ప్రదర్శించిన సమయంలో అల్లు అర్జున్ రావడం పై సీఎం అసెంబ్లీలో స్పందించిన మాటల గురించి ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. వాస్తవానికి అల్లు అర్జున్ రెండు రోజుల తరువాత బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే.. ఏ లొల్లి ఉండేది కాదని.. అల్లు అర్జున్ విషయంలో ముందూ వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుంది ఇందులో పోలీసుల తీరును తప్పుబట్టను అని తెలిపారు.
తన పేరు చెప్పలేదని రేవంత్ అర్జున్ ను అరెస్టు చేశారని అనడం కూడా పెద్ద తప్పు అని, రేవంత్ ఆ స్థాయి దాటిన బలమైన నేత అని అర్జున్ స్థానంలో రేవంత్ ఉన్నా అలానే అరెస్టు చేస్తారు. చట్టం ఎవరికి చుట్టం కాదు అని రేవంత్ పై ప్రశంశలు కురిపించారు పవన్ కళ్యాణ్. తాజాగా బండి సంజయ్ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ప్రశంసించడాన్ని తప్పుబట్టిన కేంద్రమంత్రి బండి సంజయ్ పవన్ కళ్యాణ్ కు రేవంత్ రెడ్డిలో ఏం మంచి కనిపించింది..? పవన్ కు రేవంత్ రెడ్డి ఏ కోణంలో మంచిగా కనిపించారు. 6 గ్యారంటీలు అమలు చేయనందుకు రేవంత్ రెడ్డి మంచిగా కనిపించాడా? పవన్ కళ్యాణ్ కు ఎవరైనా చెవిలో చెప్పారేమో అని సెటైర్లు వేశారు.