CM Revanth Chalo Raj Bhavan: రాజ్ భవన్ ను ముట్టడించనున్నారు సీఎం రేవంత్. మరికాసేపట్లోనే… ఛలో రాజ్ భవన్ లో పాల్గొననున్నారు సిఎం రేవంత్. ఇందిరా గాంధీ విగ్రహం నుంచి కాంగ్రెస్ ర్యాలీ ఉండనుంది. ఖైరతాబాద్ సర్కిల్ నుంచి లేక్ వ్యూ వరకు ర్యాలీ లో పాల్గొననున్నారు సిఎం రేవంత్ రెడ్డి. అక్కడ ర్యాలిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అయితే.. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్..ఫైర్ అయ్యారు. ముఖ్య మంత్రే రాజ్ భవన్ ముట్టడికి వెళ్తే.. రాష్ర్టంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితేంటి..? అంటూ నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్.. సమావేశాలు తప్పించుకువడానికే ఇలాంటివి చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వం మనుసు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. పరిపాలన చేయడానికి ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు..ధర్నాలు చేయడానికి కాదంటూ చురకలు అంటించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఈ రాష్ర్టంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం వ్యక్తం అవుతుందని ఫైర్ అయ్యారు.