ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజనపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం !

-

ఢిల్లీలో తెలంగాణ భవన్, ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజన, నూతన తెలంగాణ భవన్ నిర్మాణ విషయాలపై దృష్టి సారించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఆస్తుల్లో తెలంగాణ వాటా, నూతన భవనాల నిర్మాణంపై తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ శ్రీ గౌరవ్ఉ ప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డి శ్రీ సంజయ్ జాజులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు.

Revanth Reddy

ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాస గృహాల స్థితిపై సీఎం ఆరా తీశారు. మూడు, నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ శ్రీ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నూతన భవనం నిర్మించుకుందామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. అంతకు ముందు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం ఉన్న భవన్ మ్యాప్ ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version