HCA: మహిళ క్రికెటర్లతో కోచ్ జై సింహా అసభ్య ప్రవర్తన !

-

తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. మహిళ క్రికెటర్లతో ఓ కోచ్ అసభ్య ప్రవర్తనకు పాల్పడ్డాడు. మహిళ క్రికెటర్లను బస్సులో తీసుకెళ్తూ కోచ్ జైసింహా డ్రింక్ చేస్తున్నాడు. మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడాడు జైసింహా. అయితే…జైసింహాకు అడ్డు చెప్పకుండా ఎంకరేజ్ చేశాడు పూరిమ రావు. నాలుగు రోజుల కిందట హైదరాబాద్ నుంచి విజయవాడ కు మ్యాచ్ ఆడేందుకు వెళ్ళింది విమెన్స్ క్రికెట్‌ టీమ్.

Coach Jai Simha’s misbehavior with women cricketers

అయితే..రిటర్న్ లో ఫ్లైట్ కి రావాల్సి ఉండగా… కావాలనే డిలే చేశాడు కోచ్ జైసింహా. దీంతో వారందరూ బస్సులో వచ్చారు. ఇక బస్సులో మహిళా క్రికెటర్ల ముందే మద్యం సేవించిన జై సింహా..వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పూర్ణిమ రావుతో జై సింహాలపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశాడు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు మహిళా క్రికెటర్లు. ఫిర్యాదు చేసి నాలుగు రోజులు అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళా క్రికెటర్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version