Telangana:ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరిలోనూ గుండెపోటు వస్తోంది. జీవనశైలిలో మార్పులు.. తీసుకుంటున్న ఆహారం వల్ల ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అప్పటి దాకా ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్లు అకస్మాత్తుగా కుప్పకూలుతున్నారు.
అయితే.. తాజాగా గుండెపోటుతో 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా ధరూర్‌కు చెందిన మూడో తరగతి బాలుడు హర్షిత్ (9) కుటుంబంతో కలిసి తిరుపతి దైవదర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న తరువాత గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ధరూర్ విషాద ఛాయలు అలుముకున్నాయి.