భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బొగ్గు ఉత్పత్తితో సింగరేణి చరిత్ర సృష్టించింది. సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని.. సింగరేణి సి అండ్ ఎం.డి. ఎన్.శ్రీధర్ కీలక ప్రకటన చేశారు. బొగ్గు రవాణా లో 35.1 శాతం వృద్ధి, ఓవర్ బర్డెన్ తొలగింపులో 20.1 శాతం వృద్ధి జరిగిందని ఆయన వెల్లడించారు.
దేశంలో నెంబర్ 1 స్థానంలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నిలిచిందని ప్రకటన చేశారు. సోలార్ విద్యుత్తు ప్లాంట్ల ద్వారా రూ. 130 కోట్ల విద్యుత్ ఖర్చులు ఆదా అవుతున్నాయని ఆయన చెప్పారు. సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా 650 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందని… రికార్డు స్థాయిలో 26 వేల కోట్ల టర్నోవర్ ఉందని ఆయన స్పష్టం చేశారు.
గత ఏడాదితో పోల్చితే బొగ్గు ఉత్పత్తిలో 28.6 శాతం వృద్ధి జరిగిందని వివరించారు. బొగ్గు రవాణా లో 35.1 శాతం వృద్ధి, ఓవర్ బర్డెన్ తొలగింపులో 20.1 శాతం వృద్ధి జరిగిందని.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యమని.. సింగరేణి సి అండ్ ఎం.డి శ్రీధర్ ప్రకటన చేశారు..