Telangana: కుప్పకూలిన SLBC సొరంగం…ఏకంగా 52 కూలీలు !

-

Collapsed SLBC tunnel: నల్గొండ పెను విషాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలింది. లోపల భారీ సంఖ్యలోనే కూలీలు ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఎడమ వైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితం మళ్లీ పనులు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Collapsed SLBC tunnel

ప్రమాద సమయంలో SLBC టన్నెల్ లోపల 52 కూలీలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు ముగ్గురు కార్మికులను బయటికి తీసిన అధికారులు…వారిని జెన్కో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఉదయం 8:30కి జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగినట్లు ఇప్పుడే తెలిసిందన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్తున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version