దమ్ముంటే అసెంబ్లీకి రా.. కేసీఆర్ కి మంత్రి కోమటిరెడ్డి కౌంటర్

-

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా విఫలం చెందారని.. ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా నిద్ర పోయాడని తెలిపారు. తన ఛాలెంజ్ కి స్పందించి కేసీఆర్ బయటికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ తడాఖా తెలిసిందని విమర్శించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర లేదని.. నాలాంటి వాళ్లు పదవీ త్యాగం చేయడం వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు.

కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ కల సహకారం అయిందని.. దొంగ దీక్షలు చేయడం కేసీఆర్ కి అలవాటు అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. నేను కొడితే మీ పార్టీ కూడా లేవదని.. దమ్ముంటే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలన్నారు. ప్రభాకర్ రావు, శ్రావణ్ లు ఇండియాకు రావద్దని కేసీఆర్ చెప్పాడని.. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి పై చర్చకు సిద్దమా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version