తెలంగాణలో ఆధునిక రైస్‌మిల్లుల ఏర్పాటుకు కమిటీ

-

మరో రెండు కోట్ల టన్నుల ధాన్యం మిల్లింగ్‌ కెపాసిటీని పెంచే దిశగా రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న రైస్‌ మిల్లులకు అదనంగా మరిన్ని అధునాతన రైస్‌ మిల్లులను అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆధునిక మిల్లుల ఏర్పాటుకు విధివిధానాల ఖరారుకు కమిటీని ప్రకటించారు. శుక్రవారం రోజున సచివాలయంలో సీఎం ఉన్నతస్థాయిసమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో పండుతున్న ధాన్యాన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేయడానికి తగ్గట్టుగా అధునాత రైస్‌ మిల్లులను ఏర్పాటు చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. విధివిధానాల ఖరారుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షునిగా కమిటీని సీఎం ప్రకటించారు. ఈ కమిటీలో సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఐటీ, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి సభ్యులుగా ఉంటారు.

అదనపు పంటను దృష్టిలో ఉంచుకుని.. అధునాతన మిల్లులు ఏర్పాటు చేయబోతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రైస్‌మిల్లులు కొనసాగుతాయని చెప్పారు. కొత్త మిల్లుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ విధివిధానాలను ఖరారు చేసి కార్యాచరణ ప్రారంభిస్తుందని తెలిపారు. అంతర్జాతీయస్థాయిలో పేరున్న ‘సటాకె’ వంటి కంపెనీలతో చర్చించామని.. వారితో ఇవాళ్టి నుంచే కమిటీ చర్చలు జరిపి నివేదిక అందజేయాలని ఆదేశించినట్లు కేసీఆర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version