కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ పార్టీలు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు : ఈటల రాజేందర్

-

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ పార్టీలు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మణుగూరులో పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈటల రాజేందర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పడి నుండి ప్రజలకి ఇచ్చిన ఎలాంటి హామీ నెరవేర్చలేదు. కేవలం మహిళలకు ఉచిత బస్సు తప్ప వారు చేసిందేమీ లేదు. కేవలం ఆరు నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంతో వ్యతిరేకత పెరిగింది. బీఆర్‌ఎస్ పార్టీపై గత అసెంబ్లీ ఎన్నికలలోనే ప్రజలకు నమ్మకం పోయింది. బీజేపీ పార్టీ తెలంగాణలో రోజురోజుకీ బలపడుతోంది. ప్రధాని మోదీ హయాంలో దేశం ఎంత అభివృద్ధి చెందిదో మనందరకూ తెలుసు.

 

రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనే. అందుకే సర్పంచ్ ఎన్నికల మొదలుకొని, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలలో సీరియస్‌గా పోటీ చేసి గెలుపొందాలని, కార్యకర్తలందరూ సహకరించాలని కోరుతున్నాను. కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేదు. చిరుద్యోగులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు, ఆర్టీసీ, సింగరేణి ఉద్యోగులకు, నిరుద్యోగులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాను. గత పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ తనదైన ముద్ర వేశారు. ప్రధాని మోడీ ప్రభావం దేశ వ్యాప్తంగా ఉంది. ప్రజలకు ప్రధాని మోడీ గ్యారెంటీపై విశ్వాసం ఉంది. ఎక్కడికి వెళ్లినా ప్రధాని మోడీనే మళ్లీ ప్రధాని కావాలంటున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

Read more RELATED
Recommended to you

Exit mobile version