తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈనెల 19న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరుపై సభలో చర్చ జరుగుతున్నది.
ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ వాళ్ళు విపరీతంగా అభివృద్ధి చేస్తున్నారు. అన్ని హామీలు అమలు చేస్తున్నారు. కానీ ప్రచారం చేసుకోవడం లేదు.సరిగ్గా ప్రచారం చేసుకుంటే కాంగ్రెస్‌కి తిరుగే ఉండదని చాలామంది ప్రజలు అంటున్నారు’ అని ఆయన స్పష్టంచేశారు.గత ప్రభుత్వం ఏం చేయకపోయినా అది చేస్తున్నాం. ఇది చేస్తున్నాం అని విపరీతంగా ప్రచారం చేసుకున్నారని విమర్శించారు.