కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపన చెప్పాలి. ఇంటింటికి పోరాటాన్ని తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఉద్యమం కేవలం నల్గొండ సభతోనే ఆగదు. ఆరు నెలల్లో ట్రిబ్యునల్ తీర్పు వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిరంజన్ రెడ్డి.
గత పదేళ్లుగా ప్రాజెక్టులను కాపాడుకుంటూ వచ్చినం. ఢిల్లీ మీటింగ్ కాంగ్రెస్ యథా పలంగా కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులను కలిపిందన్నారు. తెలంగాన ప్రజలను బీఆర్ఎస్ సమాయత్తం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కలుపుకొని పోవాలన్నారు. అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు ఆగమైపోతారు. కరెంట్ ఉత్పత్తి చేయాలన్నా..తాగునీటి కోసం అయినా కేఆర్ఎంబీ అనుమతి తీసుకునే పరిస్థితి అన్నారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో నీటి వాటా తేలే దాకా పోరాటం ఆగదు అన్నారు.