సంచలనం రేపిన కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వే.. ఏకంగా మూడో స్థానానికి డౌన్

-

రాష్ట్రంలో కాంగ్రెస్ ఇంటర్నల్ సర్వే ఒకటి పెను సంచలనం రేపింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నరలోపే ప్రజావ్యతిరేకత తీవ్రమైనట్లు అందులో స్పష్టమైనట్లు సమాచారం. ఈ సర్వేలో ఏకంగా 3వ స్థానంకు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సింగిల్ డిజిట్‌కు మాత్రమే పరిమితం కానుందని సమాచారం. శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ మినహా మంత్రులంతా ఎన్నికల్లో ఓటమి పాలు కావాల్సిందేనని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జోరు పెరిగిందని, గ్రేటర్ హైదరాబాద్‌లో ఏకంగా క్లీన్ స్వీప్ చేస్తుందని సదరు కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ కుండబద్దలుకొట్టినట్లు తెలిసింది.

ఇంటర్నల్ సర్వే మీద సీఎం రేవంత్‌కు రాహుల్ గాంధీ క్లాస్ పీకారని, ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సర్వే ఫలితాలు ఇలా :

బీఆర్ఎస్‌ – 85 – 87
బీజేపీ – 15 – 17
కాంగ్రెస్ – 8 – 10
ఎంఐఎం – 7 – 8

Read more RELATED
Recommended to you

Latest news