Komatireddy Raj Gopal Reddy: ఆంధ్ర మీడియా చానల్స్ పై రాజ్ గోపాల్ రెడ్డి సీరియస్ !

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర మీడియా చానల్స్ మీద మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి. తాజాగా చిట్‌ చాట్‌ లో పాల్గొన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళ తరువాత కూడా ఆంధ్రమీడియా తెలంగాణ రాజకీయాలను శాసించాలని చూస్తుందని ఆగ్రహించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి.

Congress MLA Raj Gopal Reddy got angry on Andhra media channels

మేము ఏ మాత్రం దీనిని ఒప్పుకోమబోమని వెల్లడించారు. ఆనాడు ఆత్మగౌరవం కోసమే మేము తెలంగాణ రాష్ట్రం కావాలని పార్లమెంట్ లో కొట్లాడామన్నారు. BRS పార్టీ… మా మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోంది.. BRS ట్రాప్ లో పడేది లేదని తెలిపారు. మంత్రి పదవి వచ్చేటప్పుడు వస్తుంది.. అది అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. మంత్రి పదవి రాలేదని BRS ట్రాప్ లో పడతానని expect చేస్తున్నారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version