నేడు మునుగోడులో కాంగ్రెస్ బహిరంగ సభ..

-

మునుగోడు నియోజక వర్గంలో మరోసారి జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే.. మునుగోడు నియోజక వర్గం చండూరు లో ఇవాళ కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది అధిష్టానం. ఇందులో భాగంగానే బహిరంగ సభ కోసం చుండూరు లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌.

ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు చుండూరు లోని జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో సభ నిర్వహించనుంది కాంగ్రెస్‌ పార్టీ. ఈ బహిరంగ సభలో రేవంత్‌ రెడ్డి ప్రసంగించనున్నారు. అలాగే ఈ బహిరంగ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి, ఆర్. దామోదర్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి పాల్గొంటారు.

అటు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి వస్తారా ? లేదా ? అనేది తేలాల్సి ఉంది. కాగా.. కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా కారణంగా మునుగోడు నియోజక వర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయింది. మరో నాలుగు నెలల్లోనే మునుగోడు నియోజక వర్గం ఉప ఎన్నిక రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version