తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది: మాణిక్యం ఠాకూర్

-

మే 6న వరంగల్ లో రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్.ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో రాహుల్ గాంధీ పాల్గొని సభ వేదికను గ్రౌండ్స్ ని సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ..బంగారు తెలంగాణ పేరుతో కెసిఆర్ కుటుంబం తన కబంధ హస్తాల్లో తెలంగాణని పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది అన్నారు.వరి వెయ్యద్దు అన్న కెసిఆర్..తన మాట మార్చి రైతులను గందరగోళానికి గురిచేశారన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయన్నారు.

ధాన్యం కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది అన్నారు.వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కాంగ్రెస్ కి కలిసొచ్చే గ్రౌండ్ అని తెలియజేశారు.ఇక్కడి నుండి రైతులకు రాహుల్ గాంధీ సందేశం ఇస్తారని చెప్పారు.రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుందో రాహుల్ గాంధీ ప్రకటించబోతున్నట్లు చెప్పారు.వచ్చే ఎన్నికల్లో సోనియా గాంధీ సారథ్యంలో తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నాం అని అన్నారు మాణిక్యం ఠాకూర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version