జూబిలీ హిల్స్ హౌసింగ్ సొసైటీ నూతన పాలక మండలి లో మొదలైన విబేధాలు

-

నూతనంగా ఎన్నికై న జూబ్లీ హిల్స్ సొసైటీ పాలక మండలిలో విబేధాలు రచ్చకెక్కాయి . సభ్యులు బాహాబాహీ కి దిగినట్టుగా తెలుస్తోంది , సొసైటీ ప్రెసిడెంట్ మరియు సభ్యుల పై సెక్రటరీ మురళీ ముకుంద్ పోలీసులుకు కంప్లైంట్ ఇచ్చాడు. సొసైటీ బై లాస్ ప్రకారం సెక్రటరీ అయిన తను రికార్డ్స్ మైంటైన్ చేస్తున్నాననీ ,ఎప్పుడు ఎవరికీ ఏ రికార్డు అవసరం వచ్చినా సెక్రటరీ సమక్షం లో రికార్డ్లు చూడటానికి సభ్యులకు అధికారం ఉంది.

Jubilee Hills Housing Society

కానీ, నిబంధనలకు విరుద్ధంగా, రికార్డు రూమ్ తాళాలు ఇవ్వాల్సిందిగా సొసైటీ ప్రెసిడెంట్ మరియు ఇతర సభ్యులు తనను రెండు గంటల పాటు నిర్భంధించారని, తన పైన దౌర్జన్యం చేసారనీ , సెక్రటరీ మురళి ముకుంద్ అటు పోలీసులకు ఇటు సహకార సంఘాల రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. ఎన్నికైన కొద్ది నెలల్లోనే ఇలాంటి గొడవలతో సొసైటీ ని సొసైటీ అధ్యక్షుడు భ్రష్టు పట్టిస్తున్నాడనీ సభ్యులు అనుకుంటున్నారు .

Read more RELATED
Recommended to you

Exit mobile version