సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి లేఖ

-

సమగ్ర శిక్షలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమ బద్దీకరించి వారికి వెంటనే పే స్కేల్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నామని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత ఎన్నికల సమయంలో ఉద్యోగాలు క్రమబద్దీకరిస్తాయని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో  విద్యాశాఖ సమగ్ర శిక్షలో రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ రాత పరీక్షల ద్వారా జిల్లా, మండల, స్కూల్ కాంప్లెక్స్, పాఠశాల స్థాయిలలో వివిధ పోస్టులకు కాంట్రాక్టు పద్దతిన నియామకం చేపట్టడం జరిగిందన్నారు.

Chada Venkat Reddy

రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ల నుంచి 19,600 మందికి పైగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూన్నారన్నారు. హామీలు అమలు కాకపోవడంతో ఉద్యోగులంతా నిరుత్సాహంలో ఉన్నారు. ఈ ఉద్యోగాలను క్రమబద్దీకరించి విద్యాశాఖలో విలీనం చేయడం..తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించి పే స్కేల్ ఇవ్వాలన్నారు. ప్రతీ ఉద్యోగికి జీవిత బీమా రూ.10 లక్షలు, ఆరోగ్య బీమా రూ.10లక్షలు కల్పించాలని డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version