తెలంగాణలో దారుణం…వివాహితపై ఆటో డ్రైవర్ల గ్యాంగ్​రేప్​

-

తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది. హనుమకొండ నయీమ్ నగర్ సమీపంలో నివసిస్తున్న వివాహిత ఏప్రిల్ 27న పని మీద బయటకు వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి కావడంతో కేయూ క్రాస్ వద్ద రోడ్డుపై వెళ్తున్న ఆటోను ఆపి తనను రంగ్ బార్ వద్ద దింపాలని డ్రైవర్ను కోరారు. మహిళను ఆటో ఎక్కించుకున్న డ్రైవర్ రాకేష్ తన స్నేహితులైన ఆటో డ్రైవర్లు సనత్, సతీష్ కు ఫోన్ చేయగానే కొద్దిసేపటికి వాళ్ళు వచ్చి ఆటో ఎక్కారు.

ఆటోను మహిళ చెప్పిన చోటకు కాకుండా భీమరం వైపు తీసుకెళ్లారు. దీంతో తనను ఎటు తీసుకెళుతున్నారంటూ ఆమె అరవడం ప్రారంభించారు. రాకేష్ స్నేహితులు ఆమెను అరవద్దంటూ బెదిరించారు. భీమారం గ్రామ శివారులోకి వెళ్లిన తర్వాత ఆటో సౌండ్ బాక్స్ శబ్దం బాగా పెంచి ఆటోలో ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. తర్వాత రంగ్ బార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్ళిన మహిళ బంధువులకు విషయం తెలపడంతో వారు హనుమకొండ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మహిళలకు వైద్య పరీక్షలు చేయించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు హనుమకొండ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ జి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version