తెలంగాణ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేపే రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. మూడో విడత కింద లక్షన్నర నుంచి 2 లక్షల వరకు రుణమాఫీని చేయనున్నారు సీఎం రేవంత్. ఈ మహోత్తర కార్యక్రమం ఆగస్టు 15వ తేదీ అంటే రేపు ఖమ్మం జిల్లా వైరాలో ప్రారంభం కానుంది.
అమెరికా నుంచి ఇవాళ హైదరాబాద్ చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి. ఆ వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఈ చివరి విడతలో దాదాపు 14 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. 20 లక్షలకు పైగా కొత్త రైతులకు రుణమాఫీ అయినట్లు భావించాలి. అయితే ఐటీ రిటర్న్స్ అలాగే ఒకే రేషన్ కార్డులో ఇద్దరు పేర్లు ఉంటే కూడా చాలామందికి రుణమాఫీ కాలేదని విమర్శలు వస్తున్నాయి.