చాలా మంది ప్రతిరోజూ 10,000 అడుగులు వేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు అని కచ్చితంగా ఫాలో అవ్వాలని కష్టపడి మరీ నడుస్తూ ఉంటారు. అయితే నిజానికి ప్రతిరోజు 10,000 అడుగులు వేయాలనేది అవాస్తవం. నడవడం వలన ఆరోగ్యానికి మంచిదే. నడిస్తే కార్డియా వాస్కులర్ హెల్త్ బావుంటుంది. అయితే ఎప్పుడైనా ఆలోచించారా..? 10,౦౦౦ అడుగులు వేయాలన్నది ఎవరు నిర్ణయించారు..? దీని వలన ఉపయోగం ఉంటుందా అని..? అయితే 1960లో జపనీస్ కంపెనీ ఒక స్పీడోమీటర్ తీసుకువచ్చింది. వెయ్యి అడుగుల మీటర్ అని దానికి జపనీస్ లో పేరు పెట్టారు.
అప్పటినుండి కూడా రోజు 10,000 అడుగులు వేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు అని చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు. అయితే నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క మనిషి కూడా మరొకరితో పోల్చుకుంటే విభిన్నంగా ఉంటారు. మనిషి యొక్క బరువు, ఎత్తు, వయస్సు ఇలా ఇంకొకరితో పోల్చుకుంటే డిఫరెంట్ గా ఉంటుంది. మీకు నచ్చినట్లు 10,000, 7,000, 5,000 ఇలా అడుగులు వేయవచ్చు. ప్రతిరోజు ఎక్కువగా నడవడానికి ప్రయత్నం చేయడం వలన మీ సామర్థ్యం పెరుగుతుంది. అలాగే ఫిట్ గా ఉండవచ్చు. అయితే కచ్చితంగా 10,000 అడుగులు రోజు నడవాలన్నది ఏమీ లేదు.
కానీ ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం ప్రతిరోజు 30 నిమిషాలు పాటు ఫిజికల్ యాక్టివిటీ చాలా ముఖ్యం. దానితో పాటుగా సమతుల్యమైన ఆహారం తీసుకుంటే ఫిట్ గా ఉండవచ్చు. ఇవే కాకుండా మీరు వెయిట్ ట్రైనింగ్, యోగ వంటి వాటిపై కూడా ఫోకస్ పెట్టవచ్చు. ఇక పదివేల అడుగులు వెయ్యట్లేదు అని చింత వద్దు. మీకు ఇష్టం వచ్చినట్లు మీ వయసు, మీ బరువు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫిజికల్ యాక్టివిటీ పై దృష్టి పెట్టవచ్చు. మరి ఇక సంతోషంగా ఫీట్ గా ఉండండి. 10000 అడుగులు కచ్చితంగా వేయాలని నియమం వద్దు. ఫిట్ గా ఉండడానికి మీరు ఎలాంటి టిప్స్ ని ఫాలో అవుతారో కామెంట్ చేయండి.