యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు అలర్ట్. త్వరలోనే స్వామివారి దర్శనం విషయంలో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ విషయాన్ని ఆలయ ఈవో భాస్కర రావు తెలిపారు. ఇంతకీ ఆ మార్పు ఏంటంటే?
తిరుమల తరహాలో యాదాద్రిలోనూ స్వయంభువుల దర్శనం కలగనుంది. మహాముఖ మండపంలో దూరం నుంచే మూలవరులను చూస్తూ గర్భగుడి చెంతకు భక్తులు చేరేలా కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని యాదాద్రి ఈవో భాస్కర్ రావు వెల్లడించారు.
స్వామి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికీ . తీర్థంతోపాటు శఠారి ఆశీర్వాదం అందేలా చూస్తామని తెలిపారు. ఆలయ శౌచాలయంలో మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్ల వెలుగుచూసిన ఘటనపై చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. కొండపైన ఓ షాప్‌లో పనిచేసే వ్యక్తి వీటిని తీసుకొచ్చినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయాలని భద్రత సిబ్బందిని ఆదేశించినట్లు ఈవో భాస్కరావు పేర్కొన్నారు.