తెలంగాణ ఎన్నికలపై మరో సర్వే రిలీజ్.. ఏ పార్టీ అధికారంలోకి రాదు ?

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల సమయం ఉందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు ప్రచారంలో మునిగిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ విడత కూడా ఇవాల్టి నుంచి ప్రారంభించనున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓ సర్వే రిపోర్టు విడుదలైంది. ఇప్పటికే చాలా సర్వేలు రిలీజ్ అయినప్పటికీ ఈ సర్వే మాత్రం చాలా భిన్నంగా ఉంది. ఏ పార్టీకి అధికారం రాదని ఈ సర్వే స్పష్టం చేసింది.

Democracy Times Network has revealed the results of a poll survey regarding the Telangana Assembly elections

అంటే కచ్చితంగా తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందని వెల్లడించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డెమోక్రసీ టైమ్స్ నెట్వర్క్ అనే సంస్థ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం భారత రాష్ట్ర సమితి పార్టీకి 45 స్థానాలలో… కాంగ్రెస్ పార్టీ 42 స్థానాలలో గెలుపొందుతుందని సర్వే అంచనా వేసింది. ఇక బిజెపి పార్టీ నాలుగు స్థానాలు, ఎంఐఎం పార్టీ ఆరు స్థానాలలో గెలుస్తుందని స్పష్టం చేసింది ఈ సర్వే. అంతేకాకుండా 22 అసెంబ్లీ స్థానాల్లో మాత్రం హోరాహోరీ పోటీ తప్పదని తెలిపింది. ఆ 22 స్థానాలలో ఎక్కువ స్థానాలు ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version