మంథని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తోంది. దేశంలో కావాల్సిన రాజకీయ పరిణతి లేదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఓటు వజ్రాయుదం అన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం.. తెలంగాణ కోసం 15 ఏళ్లు ఉద్యమం చేసిన తరువాత ప్రజల కోసం ఏమేమి పనులు చేశామో మీ అందరికీ తెలుసు. 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టింది ఎవ్వరు అని ప్రశ్నించారు కేసీఆర్. 1969లో కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీనే.
కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని.. మొండిగా పోయి చావు నోట్లో తలకాయ పెడితే తెలంగాణ వచ్చింది. రైతుల గురించి, దళితుల గురించి, గిరిజనుల, ఆదివాసుల గురించి కాంగ్రెస్ పార్టీ ఆలోచించి ముందుకు వస్తే.. వీరికి ఇలాంటి పరిస్థితి రాదు. ఆలోచించకుండా గుడ్డిగా ఓటు వేస్తే ఫలితం రాదన్నారు. ప్రజలు గెలిచే ప్రజాస్వామ్య ప్రక్రియ రావాలి అని కోరారు సీఎం కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రైతుబంధు రామ్ రామ్.. దళిత బంధు జై భీమ్ అవుతుంది.