హైడ్రా ఆన్ అలర్ట్.. గండిపేటలో అక్రమ వ్యాపార సముదాయాల కూల్చివేత

-

ట్రైసిటీ పరిధిలోని సర్కారు ఆస్తులను కాపాడడంతో పాటు మరింత పటిష్టంగా విపత్తుల నిర్వహణ చేపట్టేందుకు ఏర్పాటైన హైడ్రా హడల్ పుట్టిస్తోంది. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ నగరంలో అక్రమంగా నిర్మించిన వాటిని కుప్పకూల్చేస్తోంది. ఇటీవలే ఏర్పాటైన హైడ్రా కబ్జాలు, ఆక్రణలపై మరింత సమర్థవంతంగా చర్యలు చేపడుతోంది.

తాజాగా హైడ్రా రంగారెడ్డి జిల్లాలో ఉక్కుపాదం మోపుతోంది. రంగారెడ్డి జిల్లాలోని గండిపేటలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తోంది. ఇక్కడి ఖానాపూర్‌లో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలు నిర్మించారని హైడ్రా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే చర్యలకు ఉపక్రమించినట్లు వెల్లడించారు. దీంతో అధికారులు, యజమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు సాగాయి. మరోవైపు హైడ్రా పనితీరును రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రశంసించారు. హైడ్రా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version