పోలీస్ శాఖలో త్వరలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం..!

-

కరీంనగర్ కమిషనరేట్ లో మూడు జిల్లాల పోలీసు అధికారులతో డీజీపీ జితేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫోన్ టాపింగ్ గురించి ఇప్పుడు మాట్లాడకూడదు. ఫోన్ టాపింగ్ లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా అని అన్నారు. అలాగే ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి మన దగ్గరకు గంజాయి వస్తోంది. మన దగ్గర గంజాయి పండదు. గంజాయి మీద అనేక కేసులు నమోదు చేస్తున్నాం. కొన్ని ముఠాలను పట్టుకుంటున్నాం అని తెలిపారు.

అలాగే తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం ఏమాత్రం లేదు. మన దగ్గర మావోలు లేరు.. అది ప్రచారం మాత్రమే. ఇక్కడి నుండి మావోయిస్టులు వెళ్లిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మావోయిస్టుల ప్రభావం తగ్గింది. నకిలీ నక్సలైట్ పై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. అలాగే మావోయిస్టు సానుభూతిపరుల మీద మా నిఘా ఉంటుంది అని పేర్కొన్నారు. అదే విధంగా పోలీస్ శాఖలో త్వరలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని DGP జితేందర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version