తెలంగాణ ఏఎన్‌ఎంలకు బిగ్‌షాక్ తగిలింది. తెలంగాణ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్ చేయలేమంటూ చేతులు ఎత్తేశారు డిహెచ్ శ్రీనివాసరావు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న సెకండ్ ANMలను రెగ్యులరైజ్ చేయలేమని డిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
రెగ్యులరైజ్ కు బదులు రెగ్యులర్ నియామకాల సమయంలో వెయిటేజ్ మార్కులు కలపడంతో పాటు వయోపరిమితి సడలింపు ఇస్తామన్నారు. సెకండ్ ఏఎన్ఎంల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విధుల్లో చేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా, స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 26న కోటి మొక్కల పెంపకం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని మంచిరేవుల గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.