విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే వారే కరువయ్యారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని విమర్శించారు. వీఐపీ జోన్ గా పిలవబడే హైదరాబాద్ సెంట్రలో సర్కిల్ లో గంటల కొద్దీ విద్యుత్ అంతరాయం ఏర్పడినా క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోవడంలేదని ఓ దిన పత్రికలో వచ్చిన కథనాన్ని బుధవారం హరీశ్ రావు ట్విట్టర్ లో షేర్ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో విద్యుత్ కోతలు ఉండటం విద్యుత్ నిర్వహణ లోపానికి నిదర్శనం అని ధ్వజమెత్తారు. విద్యుత్ సౌధ పక్కనే ఉన్న ఆనంద్ నగర్, మాసాబ్ ట్యాంక్ లో రాత్రి నుంచి ఉదయం వరకు కరెంటు పోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినా పట్టించుకునే వారు లేని విమర్శించారు. ఇప్పటికైనా నిర్లక్ష్యం వీడి కరెంట్ కోతలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.