తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క- సారక్క జాతరకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 21 నుంచి 24 వరకు జాతరను ఘనంగా జరిపించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. అయితే మేడారం వెళ్లే భక్తులకు హెలికాప్టర్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హనుమకొండ నుంచి మేడారం వద్దకు హెలికాప్టర్ ద్వారా వెళ్ళొచ్చు. అయితే ఇందుకు ఒక్కొక్కరికి రూ.28,499 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి హెలికాప్టర్లో ఆరుగురు మాత్రమే ప్రయాణించొచ్చు. ఒక రౌండ్ ట్రిప్పు తో సహా వీఐపీ దర్శనానికి సైతం పొందే వీలు కల్పించారు.
దీంతోపాటు మరో రాయుడు సైతం అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. జాతర జరిగే ప్రాంతంలో ఆరు నుంచి ఏడు నిమిషాలు చక్కెర కొట్టే ఏర్పాటు చేశారు. అమ్మవారి గద్వాల పక్కన నుంచి మొదలయ్యే రైడు జంపన్న వాగు చిలుకల గుట్టతోపాటు జాతర జరిగే ప్రదేశంలో చక్కర్ల కొడుతుంది. దీనికి ఒక్కొక్కరికి 4,800 వసూలు చేయనున్నారు. హెలికాప్టర్ల టికెట్లు పూర్తి సమాచారం కోసం 74834 33752, 04003 99999 నెంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు. Infor@helitaxi.com వెబ్ సైట్ లో సైతం సమాచారం పొందే వీలు కల్పించారు.