హైదరాబాద్‌లో మరోసారి భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. జిన్నారంలోని ఫార్మా కంపెనీలో డ్రగ్స్ డెన్‌లు బయటపడ్డాయి. 52 కిలోలకు పైగా డ్రగ్స్ ని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. అధికారులకు దొరకకుండా డ్రగ్స్ ను భూమీలో పాతి పెట్టారు. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులు డ్రగ్స్ ను బయటకు తీశారు. వాటిలో 45 కిలోల ఎపిడ్రిన్, 7.5 కిలోల మెఫెడ్రోన్ ఉన్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు రూ.6 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
Hyderabad: Directorate of Revenue Intelligence (DRI) unearthed 52.3 kgs of narcotic drugs worth Rs 6 crores on August 18. #Telangana pic.twitter.com/XbfnP5wesA
— ANI (@ANI) August 19, 2020
కాగా, ఇటీవలే నగర శివారులో సుమారు రూ. 80 కోట్లకుపైగా విలువ చేసే డ్రగ్స్ ను ఓ ప్రైవేటు బస్సులో హైదరాబాద్ నుంచి ముంబైకి తరలిస్తుండగా డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. మాదక ద్రవ్యాల ముఠా కార్యకలాపాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు డీఆర్‌ఐ అదనపు డైరెక్టర్ జనరల్ తెలిపారు.