ఫూటుగా తాగి కారుతో 6 రోడ్డు ప్రమాదాలు.. బ్రీత్‌అనలైజర్‌లో రీడింగ్‌ చూస్తే షాక్

-

పూటుగా మందు తాగిన ఓ యువకుడు హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో సోమవారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించాడు. కారుతో రోడ్డుపై దూసుకెళ్తూ రాత్రి 12.30 నుంచి 1.30 గంటల మధ్య ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. ఐకియా నుంచి రాయదుర్గం ఠాణా సమీపంలోని కామినేని ఆసుపత్రి వరకూ ఈ వరుస రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

నగరంలోని నిజాంపేట ప్రగతినగర్‌కు చెందిన పాతర్ల క్రాంతికుమార్‌ యాదవ్‌(30) ఆదివారం రాత్రి మద్యం తాగి అదే మత్తులో కారు నడుపుతూ తన గమ్యస్థానాన్ని చేరుకునే మార్గంలో ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు. ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొడుతూ దూసుకెళ్లాడు. వరుస ప్రమాదాల్ని గమనించిన కొందరు వెంటాడి మల్కంచెరువు దగ్గర క్రాంతి వాహనాన్ని అడ్డుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. క్రాంతిని రాయదుర్గం ఠాణాకు తరలించి మద్యం పరీక్షలు నిర్వహించగా మీటరు రీడింగ్‌ 550 రావడంతో పోలీసులు షాక్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version