నేటి నుంచి ఆర్టీసీ దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు

-

బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని తెలంగాణ ఆర్టీసీ 5,265 ప్రత్యేక బస్సులను నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ బస్సులు ఇవాళ్టి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నడవనున్నాయి. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు నేటి నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ ఏ.శ్రీధర్‌ తెలిపారు.

అన్ని ప్రాంతాలకు ఎంజీబీఎస్‌ నుంచి బస్సు సర్వీసుల్ని నడపడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, మెహిదీపట్నం, ఉప్పల్‌ క్రాస్‌రోడ్డు తదితర ప్రాంతాల నుంచి సర్వీసుల్ని ఏర్పాటు చేసినట్లు ఏ.శ్రీధర్‌ తెలిపారు. ప్రయాణికులకు  అసౌకర్యం కలగకుండా రవాణా శాఖ, ట్రాఫిక్‌ పోలీసు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహకారంతో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆర్‌ఎం తెలిపారు.

మరోవైపు పండుగను పురస్కరించుకుని నడిపే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులు వెంట తీసుకెళ్లే 50 కిలోలపైన లగేజీకి విధించే ఛార్జీల్లో 20 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆర్టీసీ హైదరాబాద్‌ జోన్‌ ఈడీ ఎ.పురుషోత్తంనాయక్‌ తెలిపారు. ఈ నెలాఖరు వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version