గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రచురించండి : ఈసీ

-

గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా డీకే అరుణ ఎన్నికైనట్టు  ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈసీ లేఖ రాసింది. హైకోర్టు ఉత్తర్వులను తదుపరి గదిలో ప్రచురించాలని ఆదేశించింది ఈ మేరకు హైకోర్టు తీర్పు కాఫీని జతచేస్తూ సీఈఓ కు ఈసీ అండర్ సెక్రెటరీ సంజయ్ కుమార్ లేఖ రాశారు.

జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యేగా బి.కృష్ణారెడ్డి ఎన్నికల అని హైకోర్టు ఇటీవల తీర్పు వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. నామినేషన్ సందర్భంగా తప్పుడు వివరాలతో అఫీడవిత్తు దాఖలు చేసినందుకు అందుకు శిక్షగా రూపాయలు రెండున్నర లక్షలు జరిమానా విధించింది కోర్టు. ఖర్చుల కింద పిటిషనర్ డీకే అరుణకు రూపాయలు 50,000 చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కృష్ణమోహన్ రెడ్డి తరువాత అత్యధిక ఓట్లు సాధించిన డీకే అరుణ ను 2018 డిసెంబర్ 12 నుంచి ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఎన్నికల్లో గద్వాల నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున డీకే అరుణ పోటీ చేశారు. కృష్ణమోహన్ రెడ్డికి ఒక లక్ష 57 వేలు ఓట్లు రాగా.. డీకే అరుణకు 71 వేల 612 ఓట్లు లభించాయి. దీంతో డీకే అరుణ ఎమ్మెల్యేగా విజయం సాధించిందని హైకోర్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version