కౌశిక్ రెడ్డి ఓ పిచ్చికుక్క – ఈటెల భార్య సంచలన వ్యాఖ్యలు

-

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ భార్య జమున. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులను అవమానించిన వాడికి ఎమ్మెల్సీగా ఉండే అర్హత లేదన్నారు. గవర్నర్ పై కూడా అసభ్యంగా మాట్లాడారని.. ఈటెల రాజేందర్ పుణ్యమే ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు. ఇసుక రవాణా చేసే వాళ్ళ దగ్గర రోజు లక్ష వసూలు చేస్తాడని అన్నారు.

20 కోట్లు పెట్టి ఈటెల రాజేందర్ ను చంపిస్తానని కౌశిక్ రెడ్డి చెప్పినట్లు తెలిసిందన్నారు. కెసిఆర్ చెబితేనే ఎమ్మెల్సీ మాట్లాడుతున్నారని.. తెలంగాణకు ఇటువంటి సీఎం అవసరమా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు డబ్బులు అవసరం లేదని.. ఓటుతో భూ స్థాపితం చేస్తారని అన్నారు. కెసిఆర్ ఆర్థికంగా ఇబ్బందులు పెడుతున్నాడని అన్నారు. ఇటువంటి దుర్మార్గులను ఎదిరిస్తున్నందుకు హాపీగా ఉన్నామన్నారు జమున.

ముదిరాజ్ లు నిరసనలు చేస్తున్నా సీఎంకు కనిపించడం లేదని.. వాళ్ళు చిన్న కులం వాళ్ళే అని అలా చేస్తున్నారని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ఓ పిచ్చికుక్క అని.. హుజూరబాద్ ప్రజలకి పిచ్చికుక్క అంటేనే తెలుస్తుందన్నారు. మహిళలపై ఇలానే మాట్లాడితే అయన మీద చెప్పుల దండ వేస్తారని హెచ్చరించారు. పోలీస్ లు కూడా ఆయనకు మద్దతు ఇస్తున్నారని.. ఇప్పటికైనా పోలీసులు తమ పని తాము చేస్తే బాగుంటుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version