ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టాడు. “పచ్చకామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మీరు బ్యాగులతో దొరికారని.. అందరూ మీ లాగానే బ్లాక్మెయిల్ దందాలు చేస్తారని.. సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ బతుకుతున్నారని అనుకోవడం తప్పు. IAS, IPS అధికారులు మన దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకలు.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గురించి తెలంగాణ సీఎం మాట్లాడిన మాటలు కించపరిచేలా, అగౌరవంగా ఉన్నాయి. బ్యూరోక్రాటిక్ వ్యవస్థ ప్రతిష్టను నాశనం చేసేందుకు సీఎం నిరంతరం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాను” అని కేటీఆర్ ఎక్స్ లో పేర్కొన్నారు.
బ్యూరోక్రాట్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి, సమస్యలను తెలుసుకోవాలని సీఎం రేవంత్ పలుసార్లు కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. కానీ, ఆయన చెప్పినప్పుడు సరేనంటూ తలలూపి.. ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా గురుకులాల్లో తలెత్తుతున్న సమస్యలు తెలుసుకునేందుకు రెగ్యులర్గా తనిఖీలు చేయాలని సూచించారు.