హైదరాబాద్ పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ కారుతో దూసుకెళ్లి బారికేడ్లు ఢీ కొట్టిన కేసులో నిందితుడికి సహకరించారనే ఆరోపణలతో ఆ సమయంలో పంజాగుట్ట సీఐగా ఉన్న దుర్గారావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం పరారీలో ఉన్న అతడి కోసం కొంతకాలం పోలీసులు గాలించారు. ఇక తాజాగా అతడిని ఏపీలోని గుంతకల్లులో పట్టుకున్న పోలీసులు హైదరాబాద్కు తీసుకువచ్చి విచారించిన తర్వాత సోమవారం రోజున అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో అరెస్టు అయిన మాజీ సీఐ దుర్గారావుకు బెయిల్ లభించింది. అయితే అంతకు ముందే బెయిల్ కోసం దుర్గారావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలనీ దేశం విడిచి ఎక్కడికి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో ఉన్న 11 మంది నిందితుల్లో ఇప్పటివరకు 8 మంది అరెస్టయ్యారు. ప్రధాన నిందితుడు సాహిల్ .. అతని తండ్రి షకీల్.. దుబాయిలో ఉండడంతో లుక్ ఔట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు మరొకరి కోసం గాలిస్తున్నారు.