కొల్లాపూర్ లో తీవ్ర ఉద్రిక్తత.. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అరెస్ట్

-

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ లో ఆదివారం ఉదయం నుంచి హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య నెలకొన్న వివాదమే ఇందుకు కారణంగా నిలిచింది. 2014లో టిఆర్ఎస్ అభ్యర్థిగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి కృష్ణారావు తెలంగాణ తొలి కేబినెట్లో మంత్రిగా పని చేశారు. అయితే 2018 ఎన్నికల్లో జూపల్లి ఓటమి పాలయ్యారు. జూపల్లి ఓడించినా కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరిపోయారు. అప్పటినుండి ఇరువురి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు శనివారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు.

బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ ఇద్దరు నేతలు సవాల్ విసురుకున్నారు. దీంతో పరిస్థితి చేజారి పోతుంది అని గ్రహించిన పోలీసులు చర్చకు వెళ్లేందుకు ఎమ్మెల్యే హర్షవర్ధన్ కు అనుమతి నిరాకరించారు. అయినా కూడా వినని హర్షవర్ధన్ చర్చకు వెళతాను అంటూ భీష్మించారు. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని తమ వాహనంలో ఎక్కించారు. దీంతో ఎమ్మెల్యే హర్షవర్ధన్ అనుచరులు వాహనాన్ని కదలనీయకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే హర్షవర్ధన్ ను అరెస్టు చేసిన పోలీసులు పెద్దకొత్తపల్లి కి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version