తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని కేంద్ర హోం శాఖ విడుదల చేసిన ‘యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2022’ నివేదిక వెల్లడించింది. 2022లో రైతుల బలవన్మరణాలు 41% మేర తగ్గాయని.. గత ఏడాది 6వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. ప్రస్తుతం 12వ స్థానానికి చేరిందని నివేదికలో తెలిపింది. 2021లో రైతులు 303 మంది, కౌలుదారులు 49 మంది, వ్యవసాయ కూలీలు ఏడుగురు కలిపి మొత్తం 359 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పింది. 2022లో 178 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని.. కౌలుదారులు, రైతు కూలీల ఆత్మహత్యలు ఒక్కటీ నమోదు కాలేదని పేర్కొంది.
2022లో రైతులు, కూలీలు దేశవ్యాప్తంగా 11,290 మంది ఆత్మహత్య చేసుకున్నారని.. అందులో తొలి మూడు స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లు ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,70,924 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో రైతులు, కూలీలు 6.6% మేర ఉన్నట్లు పేర్కొంది.
- రాష్ట్రంలో మొత్తం ఆత్మహత్యలు 9,980
- కుటుంబ కలహాల కారణంగా 5,390 మంది ఆత్మహత్య
- వివాహితులు 7,436 మంది ఆత్మహత్య
- వాహనాల కింద పడి తెలంగాణలో 625 మంది ఆత్మహత్య