కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళ సంతరించుకుంది. గోదావరి, ప్రాణహిత నదులు ఉభయ నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగడంతో పుష్కర ఘాట్లను తాకుతూ 11.500 మీటర్ల మేర ప్రవహిస్తోంది. కాళేశ్వరం పుష్కర ఘాట్లు, స్నాన ఘట్టాలను ముంచెత్తి నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. కాళేశ్వర పుష్కర ఘాట్ల వద్ద స్థానికులను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. తెలంగాణ, మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. బ్యారేజీలో 85 గేట్లు పూర్తిస్థాయిలో ఎత్తి ఉండడంతో 8,19,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీకి 16,850 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండడంతో 66 గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version