ఇది కాలం తెచ్చిన కరువు కాదు…కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ చురకలు అంటించారు మాజీ మంత్రి కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను పరిశీలించారు కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ….కేసీఆర్ ఏడువేల కోట్లు రైతు బంధు కోసం పెట్టిపోతే…అవి కూడా రైతులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్ లకు ఆ డబ్బు ఇస్తోందని ఫైర్ అయ్యారు. రైతుల పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది… ఇది కాలం తెచ్చిన కరువు కాదు ,కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ విమర్శలు చేశారు.
గతేడాది ఇదే సమయానికి నీళ్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం…. కాళేశ్వరం ,కేసీఆర్ పై కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నాడని మండిపడ్డారు. ఢిల్లీ కి ,హైదరాబాద్ కి తిరగడం తప్ప రైతులను పరామర్శించే సమయం రేవంత్ కి లేదు…. ఇప్పటికైనా రైతులను ఆదుకోండి… ఇప్పటికే 200 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయి పంట నష్టం జరిగిన రైతులకు పరిహారం ఇవ్వాలి…ఎకరానికి పదివేల, 25 వేల ఎంత ఇస్తారో పరిహారం ఇవ్వండని డిమాండ్ చేశారు.