గతంలో ఓటుకు నోటు.. ఇప్పుడు సీటుకు నోటు : మంత్రి కేటీఆర్

-

గతంలో ఓటుకు నోటు.. ఇప్పుడు సీటుకు నోటు అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవరకొండ బిల్యా నాయక్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్లకు ఎన్నికలు అంటే ఏటీఎం అని విమర్శించారు. ఇప్పుడు ఎక్కువగా రేవంత్ ను రేవంత్ అనడం లేదని.. రేటెంత.. రేటెంత అంటున్నారు. కోడంగల్ లో రేవంత్ రెడ్డిని ఓడిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి.. మళ్లీ పోటీ చేస్తున్నాడు.

నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతుందని.. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఫ్లోరోసిస్ తప్ప ఏమి ఇచ్చింది. సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్లలో తెలంగాణను నెంబర్ వన్ గా తీర్చిదిద్దారు. దేవరకొండ నియోజకవర్గంలో 5 లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు రూ.600 కోట్లతో జరుగుతున్నాయి. అవన్నీ రాబోయే ఏడాది కాలంలో పూర్తి అవుతాయని తెలిపారు. బిల్యా నాయక్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరడంతో దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version