రేవంత్‌ కీలక నిర్ణయం…బకాయిలు చెల్లిస్తేనే ఉచిత విద్యుత్!

-

 

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నాడని సమాచారం అందుతోంది. బకాయిలు చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ అందించేందుకు సిద్ధం అయ్యారట. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం ప్రజా పాలనలో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు.

free electricity only if dues are paid

ఈ నెలాఖరులోగా పథకం అమలుపై మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. కాగా వేలాదిమంది కొన్ని నెలలు, ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. GHMC పరిధిలోనే ఏకంగా రూ. 6 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. పూర్తిగా క్లియర్ చేయకపోతే వారికి పథకం అమలు కష్టమేనని అధికారులు చెబుతున్నారు.

కాగా, ఇవాళ తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఇవాళ మధ్యాహం 3 గంటలకు కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్‌ ఉంది. సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా అభయ హస్తం దరఖాస్తులపై చర్చ జరుగనుంది. ఇక ఇప్పటికే దరఖాస్తులు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తుంది సిబ్బంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version